Header Banner

మనుషులకు బర్డ్ ఫ్లూ వస్తే చనిపోతారా? ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా?

  Wed Feb 12, 2025 08:00        Health

కోళ్ల వ్యాపారాన్ని తరచూ దెబ్బతీసే వైరస్ ఏదైనా ఉందా అంటే.. అది బర్డ్‌ఫ్లూయే. దీన్నే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అంటారు. ఇదో రకమైన వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది ఎఖ్కువగా పక్షులకు వస్తుంది. అవి కోళ్లు కావచ్చు, లేదా ఇతర పక్షులు కావచ్చు. ఇది ఎక్కువగా కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణం ఇన్‌ఫ్లూయెంజా A వైరస్‌లు. వీటిలో చాలా రకాలున్నాయి., కామన్‌గా H5N1, H7N9, H5N8 స్టెయిన్ల వల్ల వ్యాధి రాగలదు. కొన్ని స్ట్రెయిన్లు మనుషులకు కూడా సోగలగవు. అప్పుడు మనుషులకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. 

 

బర్డ్ ఫ్లూ అనేది అన్నిసార్లూ కోళ్లకు ప్రాణాంతకం కాదు. స్ట్రెయిన్‌ని బట్టీ కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతుంది. కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యంపాలవుతాయి. స్ట్రెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు.. కోళ్ల రెక్కలు సరిగా పెరగవు, గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది, కోళ్లు ఊపిరి సరిగా పీల్చుకోలేవు. ఒక్కోసారి కోళ్లు వైరస్ నుంచి రికవరీ అయినా.. అప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే.. కోళ్లు కొన్ని గంటల్లోనే చనిపోతాయి. లేదా కొన్ని రోజుల్లో చనిపోతాయి. 

 

బర్డ్ ఫ్లూ లక్షణాలు: కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినప్పుడు.. వాటి తల ఉబ్బుతుంది. కాళ్లు, శరీరం పర్పుల్ కలర్ లోకి మారుతుంది. కోళ్లు సరిగా ఊపిరి పీల్చుకోలేవు, డయేరియా వస్తుంది. దగ్గు, తుమ్ములు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కోళ్లకు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే.. సడెన్‌గా చనిపోతాయి. కొన్ని సందర్భాల్లో వైరస్‌ని కంట్రోల్ చెయ్యడానికి కోళ్లఫారంలోని అన్ని కోళ్లనూ చంపేస్తారు. 

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందా?: అవును ఇది మనుషులకు అరుదుగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షులను ముట్టుకున్నా, వండుకొని తిన్నా, ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏవైనా వస్తువుల్ని ముట్టుకుంటే.. అప్పుడు కూడా మనుషులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ ఎగురుతూ ఉంటుంది. అలాంటి గాలిని పీల్చినా వైరస్ సోకగలదు. కోడిని సరిగా ఉడకబెట్టకపోయినా, కోడి గుడ్లను సరిగా వంటకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ చనిపోవాలంటే.. కనీసం 75 డిగ్రీల సెల్సియస్‌లో వండాలి. 

 

బర్డ్ ఫ్లూ మనుషులకు సోకితే ఏమవుతుంది?: మనుషులకు సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రం అయితే, ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది, ఊపిరి సరిగా తీసుకోలేరు, ఊపిరితిత్తులు పనిచెయ్యవు, బ్రెయిన్ దెబ్బతింటుంది. మరణాల రేటు ఎక్కువే. H5N1 స్ట్రెయిన్ సోకితే.. చనిపోయే అవకాశం 50 శాతం ఉంటుంది. అయితే.. మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతోంది. 

 

ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఉందా?: బర్డ్ ఫ్లూ వ్యాధికి కచ్చితమైన వ్యాక్సిన్ ఏదీ లేదు. మనుషులకు సోకినా వ్యాక్సిన్ లేదు. టామీఫ్లూ, రెలెంజా వంటి యాంటీ వైరల్ డ్రగ్స్‌ని డాక్టర్లు సూచిస్తారు. మనుషులకు సోకితే, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఐతే.. ఇది మనుషులకు పెద్దగా సోకట్లేదు. అందువల్ల ఆందోళన అక్కర్లేదు. 

 

బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా ఏం చెయ్యాలి?: మనుషులకు ఈ వ్యాధి రాకూడదు అంటే.. చనిపోయిన, వ్యాధి సోకిన పక్షులతో కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి. కోళ్లు, గుడ్లను తప్పనిసరిగా.. 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో వండుకోవాలి. పక్షుల దగ్గరకు వెళ్లేటప్పుడు చేతులు బాగా కడుక్కోవాలి. మాస్కులు, గ్లోవ్స్ వాడాలి. వ్యాధి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రభుత్వ సూచనలు పాటించాలి. మొత్తంగా బర్డ్ ఫ్లూ అనేది ప్రమాదకర వైరస్. తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఇది సోకకుండా చేసుకోవచ్చు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

  

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!

 

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

 

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

 

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Health #BirdFlu #Diseases #Chickens #Hens